రేపు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

ఏలూరు: ఉంగుటూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 8వ తేదీన నిర్వహిస్తున్నామని ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా కొత్త పనులకు తీర్మానాలు, అనుమతులు, వివిధ శాఖలపై సమీక్షలు ఉండవని వెల్లడించారు. అత్యవసర పనులైన తాగునీరుపై శ్రద్ధ చూపిస్తామన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు హాజరు కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.