18 నుంచి జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్
SRD: నారాయణఖేడ్ పట్టణంలోని ఈ తక్షల పాఠశాలలో ఈనెల 18 నుంచి 20 వరకు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి శుక్రవారం తెలిపారు. సైన్స్ ఫెయిర్ లో పాల్గొనే విద్యార్థులు గూగుల్ ఫామ్ లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇన్ స్పైర్ కింద ఎంపికైన 129 మంది విద్యార్థులు కూడా నమూనాలు ప్రదర్శించాలన్నారు.