సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బ్యాంక్ ఉద్యోగి

జనగామ: పాలకుర్తి మండలకేంద్రంలోని ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్న ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపి పెట్టిన ఘటన గురువారం చోటుచేసుకుంది. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న లాకావత్ ప్రతాప్ అకౌంట్ నుంచి రూ.1,15,000లను సైబర్ నేరగాళ్లు మాయంచేశారు. దీంతో బాధితుడు పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.