విద్యార్థినిని కొట్టిన టీచర్.. తల్లిదండ్రులు ఆగ్రహం

విద్యార్థినిని కొట్టిన టీచర్.. తల్లిదండ్రులు ఆగ్రహం

కృష్ణా: విద్యార్థినిని టీచర్ కొట్టగా తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన పెడనలోని దక్షిణ తెలుగుపాలెంలో జరిగింది. MPS స్కూల్లో రెండవ తరగతి చదువుతున్న తోస్మితను అల్లరి చేస్తుందని టీచర్ బెత్తం విసరగా ముఖం మీద తగలడంతో రంధ్రం పడి రక్తం బాగా కారి షర్టు తడిచింది. స్కూల్ యాజమాన్యం గాయం దగ్గర పసుపు పెట్టి ఇంటికి పంపారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు టీచర్‌ను నిలదీసారు.