ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
NGKL: ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం బల్మూరు మండలం కొండనాగుల గ్రామంలో ముస్లిం మత పెద్దలతో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లింల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యాఖ్యానించారు.