పార్టీ జెండా ఆవిష్కరించిన బీజేపీ చీఫ్

పార్టీ జెండా ఆవిష్కరించిన  బీజేపీ చీఫ్

HYD: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం బీజేపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ చీఫ్ రాంచందర్ రావు పాల్గొని పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం పార్టీ వ్యవస్థాపక పెద్దల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు, టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పాల్గొన్నారు.