సర్దార్ 150 యూనిటీ మార్చ్ ను ప్రారంభించిన MLA
BHPL: ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి స్మరించుకొని బుధవారం అంబేద్కర్ స్టేడియం నుంచి జయశంకర్ సెంటర్ వరకు ‘సర్దార్ 150 యూనిటీ మార్చ్’ నిర్వహించారు. MLA గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏకత్వం, దేశ నిర్మాణంలో సర్దార్ పటేల్ చూపిన మార్గదర్శకత్వాన్ని MLA గండ్ర కొనియాడారు.