VIDEO: నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే
E.G: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బిక్కవోలులో నీట మునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి నాయకులతో కలిసి శనివారం పరిశీలించారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాన్ని అంచనా వేస్తున్నారన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేవిధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.