ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాటర్ ట్యాప్‌ల చోరీ

SKLM: పొందూరు మండలంలోని కింతలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాడు-నేడు పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన వాటర్ ట్యాప్‌లని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీనిపై ప్రిన్సిపాల్ సునీత మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద కళాశాలలో చోరీ సంఘటనపై విచారణ జరిపారు. ఈయనతో పాటు ఎస్సై సత్యనారాయణ ఉన్నారు.