ప్రభుత్వ హాస్టళ్లపై దృష్టి సారించండి: సీపీఐ

ATP: ప్రభుత్వ హాస్టళ్లపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అనంతపురంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హాస్టల్ స్థితిగతులను చూసి బాధేసిందన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఎలాంటి సదుపాయాలు లేవన్నారు. తాగునీరు కల్పించడం లేదని, మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఆరోపించారు.