ప్రత్తిపాటికి ఘన సన్మానం

ప్రత్తిపాటికి ఘన సన్మానం

PLD: టీడీపీ రీజనల్ కో-ఆర్డినేటర్‌గా ప్రత్తిపాటి పుల్లారావు నియమితులయ్యారు. దీంతో చిలకలూరిపేటలో పార్టీ శ్రేణులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఆదివారం క్యాంప్‌ కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నియామకంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.