వైద్య శిబిరానికి విశేష స్పందన

వైద్య శిబిరానికి విశేష స్పందన

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. వైద్యులు బిపి, షుగర్, మెమోగ్రఫి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. క్యాన్సర్ రాకుండా ముందస్తు చర్యలను సూచనలు చేశారు.