సైన్స్ టాలెంట్ టెస్ట్‌లతో శాస్త్రీయ వైఖరులు

సైన్స్ టాలెంట్ టెస్ట్‌లతో శాస్త్రీయ వైఖరులు

SRPT: చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లు విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులను పెంపొందిస్తాయని హుజూర్ నగర్ మండల ఎంఈవో సైదా నాయక్ అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పరీక్ష పత్రాలను ఆయన విడుదల చేశారు. ఇలాంటి పరీక్షలు రాయడం ద్వారా విద్యార్థులకు పోటీ పరీక్షలపై అవగాహన పెరుగుతుందన్నారు.