ఎమ్మెల్సీ కవితను వెంటనే విడుదల చేయాలి

తుంగతుర్తి: ఎమ్మెల్సీ కవితను బేషరతుగా విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య కోరారు. శనివారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు లబ్ధి పొందాలని అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు.