గ్రామాలకు భారీగా నిధుల కేటాయింపు

గ్రామాలకు భారీగా నిధుల కేటాయింపు

PPM: గరుగుబిల్లి మండలంలోని పలు గ్రామాల్లో తాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి భారీ నిధులు కేటాయించారు. జల జీవన్ మిషన్ కింద చినగుడబ, గొట్టివలస, హిక్కింవలస, రావుపల్లి, వల్లరిగుడబ, ఉల్లిభద్ర గ్రామాలకు లక్షల్లో నిధులు మంజూరయ్యాయి. అలాగే తోటపల్లి, పెద్దూరు, సంతోషపురం ప్రాంతాలకు వెల్నెస్ కేంద్రాల కోసం నిధులు ఇచ్చారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు పూర్తిచేయనున్నారు.