బిగ్‌బాష్ లీగ్ నుంచి అశ్విన్ ఔట్

బిగ్‌బాష్ లీగ్ నుంచి అశ్విన్ ఔట్

టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బిగ్‌బాష్ లీగ్ నుంచి తప్పుకున్నాడు. మోకాలి గాయం కారణంగా అతడు 15వ ఎడిషన్‌కు దూరమయ్యాడు. ఈ సీజన్‌లో సిడ్నీ థండర్ జట్టుతో అతడు ఒప్పందం చేసుకున్నాడు. గాయంతో అశ్విన్ దూరం కావడం ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. కాగా, ఇప్పటివరకు BBLలో ఏ భారత క్రికెటర్ ఆడలేదు.