యువతుల నృత్య ప్రదర్శనకు ప్రశంసలు

యువతుల నృత్య ప్రదర్శనకు ప్రశంసలు

SS: సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా హిల్‌ వ్యూ స్టేడియంలో యువతులు చేసిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారు ప్రత్యేక వేషధారణలో సాయి పాటలకు అద్భుతంగా నర్తించి ప్రేక్షకులను అలరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు సహా దేశ విదేశాల నుండి వచ్చిన భక్తులు, వీఐపీలు ఈ ప్రదర్శనను ఆసక్తిగా తిలకించి ప్రశంసించారు.