రైతు సమస్యలపై ఆర్డీవోకు వినతి పత్రం అందజేత

రైతు సమస్యలపై ఆర్డీవోకు వినతి పత్రం అందజేత

SKLM: రైతు సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోవాలని టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేడాడ తిలక్ కోరారు. సోమవారం రైతులతో కలిసి టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తికి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు సాగునీరు అందడం లేదని, ఎరువులు కూడా అందకపోవడంతో ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆయన వివరించారు. తక్షణమే ప్రభుత్వం కలగజేసుకోవాలని అన్నారు.