ఇద్దరు జిల్లా ASIలకు ప్రతిష్ఠాత్మక పోలీస్ మెడల్

జగిత్యాల జిల్లా స్పెషల్ బ్రాంచ్ ASI రాజేశుని శ్రీనివాస్, మల్యాల ASI రుద్ర కృష్ణ కుమార్ కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక “ఇండియన్ పోలీస్ మెడల్"కు ఎంపికయ్యారు. 36 ఏళ్ల విశేష సేవలతో ఎలాంటి రిమార్క్ లేకుండా విధులు నిర్వర్తించిన వీరిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఈ సందర్భంగా అభినందించారు.