అతిథి అధ్యాపకుల దరఖాస్తులకు ఆహ్వానం

ELR: చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యాన శాస్త్రం, గణితశాస్త్రం బోధనకు అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. సంబంధిత పీజీ విభాగంలో కనీసం 50% మార్కులు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. Ph.D/NET/M.Phil అర్హులకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. దరఖాస్తులు 30 ఆగస్టు లోపు సమర్పించాలని అన్నారు.