బాల్య వివాహంలో భాగస్వాములైన వారికీ శిక్ష: కలెక్టర్
NRPT: బాల్య వివాహంలో భాగస్వాములైన తల్లిదండ్రులు, పురోహితులు, పెద్దలు శిక్షార్హులేనని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. బాల్య వివాహాలు పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తాయని, భాగస్వాములకు రెండేళ్లు జైలు, రూ.లక్ష జరిమానా విధిస్తారని తెలిపారు. మైనర్ల వివాహ సమాచారం తెలిస్తే 1098కు తెలియజేయాలని ఆమె సూచించారు.