ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

బాపట్ల: కారంచేడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చీరాల వైపు వెళ్తున్న ఓ ఆటోను ఎదురుగా ఓ లారీ ఢీకొట్టింది. ఈ  ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి గాయాలైనట్లు సమాచారం. స్థానికులు క్షతగాత్రులను 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.