తణుకులో సీపీఐ జిల్లా 27వ మహాసభలు

W.G: తణుకులో సీపీఐ జిల్లా 27వ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మతం, కులం, ప్రాంతం పేరుతో బీజేపీ ప్రజల్లో చిచ్చుపెట్టిందని, దేశ సమగ్రతకు, రాజ్యాంగ వ్యవస్థలకు పెను ప్రమాదం ఏర్పడిందని విమర్శించారు. రాష్ట్రం కోసం మోడీ ప్రభుత్వం చేసిందేమిటో చెప్పాలని ప్రత్యేక హోదా, విభజన హామీల్లో ఏ అంశాలకు మద్దతిచ్చిందన్నారు.