VIDEO: రహదారి భద్రతపై నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు: ఎస్పీ
SRPT: రహదారి భద్రతపై ఆటో డ్రైవర్లు, ఇతర వాహనదారులు నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ తెలిపారు. ఇవాళ సూర్యాపేట రవి కన్వెన్షన్ హాల్‌లో ఆటో డ్రైవర్లకు మై ఆటో ఈజ్ సేఫ్, నూతన డ్రైవింగ్ లైసెన్స్ పంపిణీ, కార్యక్రమం నిర్వహించారు. డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఇతర పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని పేర్కొన్నారు.