రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
అన్నమయ్య: కురబలకోట మండలం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయాలతో కుప్పకూలిన బాధితుడిని స్థానికులు 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.