80% రాయితీపై డ్రోన్ అందజేత

80% రాయితీపై డ్రోన్ అందజేత

AKP: ఎలమంచిలి మండలం జంపపాలెం గ్రామానికి 80 శాతం రాయితీపై డ్రోన్ అందజేసినట్లు మండల వ్యవసాయ అధికారి మోహన్రావు గురువారం తెలిపారు. దీని ద్వారా ఎరువులు, పురుగు మందులు పిచికారి చేసుకోవచ్చునని అన్నారు. దీనివల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుందన్నారు. ఎకరం విస్తీర్ణంలో ఆరు నిమిషాల్లో దీని ద్వారా ఎరువులు పురుగు మందులు పిచికారి చేసుకోవచ్చని పేర్కొన్నారు.