పిడుగు పడి విద్యార్థి మృతి

పిడుగు పడి విద్యార్థి మృతి

VZM: పిడుగుపాటుకు గురై విద్యార్థి మృతి చెందిన ఘటన ఎల్.కోట(M) రేగ గ్రామంలో చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతున్న చరణ్ తేజ అబ్బిచెరువు వద్ద మూత్ర విసర్జనకు వెళ్లినపుడు ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. పిడుగు పడటంతో చరణ్ తేజ అపస్మారక స్థితికి వెళ్లాడు. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. మరో విద్యార్థి దినేష్ కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.