గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
గుంటూరు ఆర్.అగ్రహారంలో ఓ ఇంటి అరుగుపై దాదాపు 60 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న లాలాపేట పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో గుర్తుపట్టిన వారు పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.