ఈనెల 10వ తేదీన మండల సర్వసభ్య సమావేశం

ఈనెల 10వ తేదీన మండల సర్వసభ్య సమావేశం

AKP: కోటవురట్ల మండల సర్వసభ్య సమావేశం ఈనెల 10వ తేదీన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక మండల పరిషత్ సమావేశం మందిరంలో ఉదయం 10:30 గంటలకు ప్రారంభించే సమావేశానికి ఎంపీటీసీలు సర్పంచ్‌లకు ఆహ్వాన పత్రాలు పంపించినట్లు పేర్కొన్నారు. మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరుకావాలని సూచించారు.