యూరియా లేక ఇబ్బందులు పడుతున్న రైతులు

VZM: ఖరీఫ్ వరినాట్లు దాదాపు పూర్తి దశకు వచ్చినప్పటికీ రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్.గొపాలం ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన బొబ్బిలిలో మాట్లాడుతూ.. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కొంతమంది వ్యాపారులు అధిక ధరలకు యూరియాను అమ్ముతున్నారని విమర్శించారు.