'వాణిజ్య కేంద్రాల్లో డొమెస్టిక్ సిలిండర్లు వాడితే కఠిన చర్యలు'
VZM: హోటళ్లు, దాబాలు, వాణిజ్య కేంద్రాల్లో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లను వాడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాల అధికారి మురళీనాథ్ బుధవారం హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘిస్తే 6A కేసులు నమోదు చేస్తామన్నారు. గత ఆరు నెలల్లో 10 కేసులు నమోదు చేసి, 40 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.