ఆటో బోల్తా పడి విద్యార్థి మృతి
KMR: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థుల ఆటో బుధవారం ఉదయం బోల్తా పడింది. ఆటో బోల్తా పడడంతో ప్రణవ్ అనే విద్యార్థి మృతిచెందగా, 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతి చెందిన విద్యార్థి పదో తరగతి చదువతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.