PGRSలో 178 అర్జీలు స్వీకరణ: జేసీ
E.G: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలు నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జేసీ మేఘా స్వరూప్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన PGRS కార్యక్రమంలో 178 అర్జీలను స్వీకరించినట్లు పేర్కొన్నారు. భూ వివాదాలు, మౌలిక సదుపాయాలు, వ్యక్తిగత సమస్యలతో పాటు ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రేషన్ కార్డులపై అర్జీలు వచ్చినట్లు చెప్పారు.