అప్రోచ్‌ రోడ్‌ నిర్మాణానికి నిధుల విడుదల

అప్రోచ్‌ రోడ్‌ నిర్మాణానికి నిధుల విడుదల

కృష్ణా: నందిగామలోని నూతనంగా మంజూరైన కేంద్రియ విద్యాలయానికి వెళ్లే అప్రోచ్ రోడ్ నిర్మాణానికి రూ.20 లక్షల నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఉత్తర్వులు జారీ చేసిందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ నిధులతో రాఘవపురం గ్రామంలో రహదారి నిర్మాణం చేపడతామని ఆమె పేర్కొన్నారు. గ్రామానికి నూతన కేంద్రియ విద్యాలయం మంజూరు అవడం విద్యారంగానికి ఎంతో మేలన్నారు.