'అదనపు పారిశుద్ధ్య కార్మికులను నియమించాలి'
ప్రకాశం: సోమవారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి ప్రజా దర్బార్ నిర్వహించారు. కనిగిరి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సమస్యలు పరిష్కారానికి అదనపు కార్మికుల నియామకం చేపట్టాలని ఎమ్మెల్యేకు పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ వినతి పత్రం సమర్పించారు. అదేవిధంగా పట్టణంలో డ్రైనేజీ కాలువలు, విద్యుత్, నీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.