VIDEO: కాకతీయుల చరిత్రకు సాక్ష్యం శివకేశవాలయం

ASF: వాంకిడి మండల కేంద్రంలోని శివకేశవాలయం కాకతీయుల నాటి చరిత్రను తెలుపుతోంది. రుద్రమదేవి తన విజయ చిహ్నంగా ఈ ఆలయాన్ని నిర్మించిందని పూర్వీకులు చెబుతున్నారు. హన్మకొండ వేయి స్తంభాల గుడిని పోలిన ఈ ఆలయంలోని శిల్పాలు, గోడలపై ఉన్న స్త్రీల నృత్య భంగిమలు కాకతీయుల శిల్పకళా చాతుర్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఆలయం పర్యాటకులను ఆకట్టుకుంటుంది.