డయేరియా బాధితుల్ని పరామర్శించన డీఎంహెచ్వో
NTR: నందిగామ మండలం చందాపురం గ్రామంలో డీఎంహెచ్వో సుహాసిని డయేరియా పరిస్థితిని పరిశీలించారు. బాధితులతో మాట్లాడి కారణాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం 17 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, ఒక మహిళ(65)ను మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌వో ఇందుమతి, వైద్యులు ఉన్నారు.