సోమేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు
BHNG: ఆలేరు మండలం కొలనుపాకలోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తన సతీమణి, బీర్ల ఫౌండేషన్ ఛైర్మన్ బీర్ల అనితతో కలిసి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకాలు, రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.