రేపు కామారెడ్డిలో జాబ్ మేళా

KMR: జిల్లాలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మల్లయ్య తెలిపారు. డిగ్రీ, మెకానికల్ ఇంజినీర్, డిప్లొమా చేసి 18-30ఏళ్ల లోపు వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తులోని రూమ్ నంబర్ 121లో శనివారం ఉదయం 10.30గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.