బావిలో పడి వ్యక్తి మృతి

బావిలో పడి వ్యక్తి మృతి

JN: బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన దేవరుప్పుల మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన మహంకాళి అనే వ్యక్తి మెడకు తాడుతో ఉరి ఉండి, బావిలో పడి ఉన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటన హత్యనా, ఆత్మహత్యనా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఘటనుకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.