ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డు అందుకున్న సతీశ్

SDPT: ప్రపంచ ఫొటోగ్రఫీ- 2025 రాష్ట్ర స్థాయి పోటీల్లో సిద్దిపేటకు చెందిన K.సతీశ్‌కు ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు దక్కింది. ఈరోజు హైదరాబాద్‌లోని ఓ హోటల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డు జ్ఞాపిక అందించారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ ఆధ్వర్యంలో ఫొటోగ్రాఫర్ల నుంచి ఫొటోలు తీసుకున్నారు.