VIDEO: చోరీకి పాల్పడిన ముగ్గురి అరెస్ట్
ELR: ఈనెల 13న తిరుమలాపురంలో ఆనంద కుమార్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు చేధించారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆదివారం వివరాలు వెల్లడించారు. విచారణలో భాగంగా పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 4,10,000 విలువైన బంగారం, వెండి, కారు, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దొంగలను త్వరగా పట్టుకున్న బృందాన్ని ఏఎస్పీ అభినందించారు.