'సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి'

'సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి'

MNCL: దండేపల్లి మండలం వెల్గనూర్ గ్రామంలో టీం యూత్ స్పిరిట్ ఆధ్వర్యంలో ఆదివారం ఓటరు చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా టీం యూత్ స్పిరిట్ సభ్యులు గ్రామంలో తిరుగుతూ ప్రజలను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు. సేకరించిన సమస్యలను సర్పంచ్, వార్డ్ సభ్యుల అభ్యర్థులకు వివరించి, గెలిస్తే పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరారు.