రైతులకు రాయితీలపై వ్యవసాయ పనిముట్లు

రైతులకు రాయితీలపై వ్యవసాయ పనిముట్లు

SRPT: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాయితీపై అందజేస్తున్న వ్యవసాయ పనిముట్లను రైతులు పొందాలని మండల వ్యవసాయ అధికారి పెందోట గణేశ్‌ అన్నారు. గురువారం జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం రైతు వేదికలో జరిగిన సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. మండలానికి చేతితో, బ్యాటరీతో మందు కొట్టే పంపులు 181 మంజూరు కాగా జనరల్-136, ఎస్సీ-29, ఎస్టీకి-16 కేటాయించామన్నారు.