తాడిపత్రి వెళ్లాలంటే వీసా కావాలా?: పెద్దారెడ్డి

తాడిపత్రి వెళ్లాలంటే వీసా కావాలా?: పెద్దారెడ్డి

ATP: మాజీ ఎమ్మెల్యే పెదారెడ్డి తాడిపత్రి పోలీసులపై మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలున్నా తనని తాడిపత్రికి వెళ్లనివ్వడం లేదన్నారు. తాడిపత్రి వెళ్లాలంటే వీసా కావాలా? అని ప్రశ్నించారు. పోలీసులు చెప్తే దరఖాస్తు చేసుకుంటానన్నారు. తాడిపత్రిలో పోలీసుల వైఖరి ఏక పక్షంగా ఉందని విమర్శించారు. కాగా.. ఇవాళ తాను తాడిపత్రికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.