VIDEO: బ్యాడ్‌మింటన్ కోర్టును ప్రారంభించిన ఎంపీ
HYD: ప్రతి ఒక్కరు వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ అన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య పార్కుల్లో ఎంపీ నిధులతో నిర్మించిన బ్యాడ్‌మింటన్ కోర్టును ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పార్కుకు వచ్చే ప్రజలు దీనిని వినియోగించుకోవాలని, క్రీడల అభివృద్ధికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు.