బాలల హక్కుల పరిరక్షణపై సమీక్ష

కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్‌లో బాలల హక్కుల పరిరక్షణపై బుధవారం సమీక్ష నిర్వహించారు. కమిషన్ సభ్యురాలు బీ. పద్మావతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బాల్యవివాహాల నిషేధం, చట్టాల అమలు, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు. విద్యా సంస్థల్లో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.