రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
NRPT: ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కిష్టాపూర్ గ్రామానికి చెందిన జైదు వెంకటయ్య (60) మృతి చెందాడు. పేట నుంచి తిరిగి వస్తూ ద్విచక్ర వాహనంపై మరో ఇద్దరితో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో మణిపూర్ తాండ శివారులో ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా, వెంకటయ్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.