VIDEO: తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో ఆకస్మిక తనిఖీలు

W.G: తాడేపల్లిగూడెం డిపో కార్యాలయాన్ని మంగళవారం ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ బోర్డు జోనల్ ఛైర్మన్, అప్పల నాయుడు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలో ఉన్న వివిధ స్టాళ్లను, సైకిల్ స్టాండ్లను ఆయన పరిశీలించారు. వ్యాపారస్తులందరూ కూడా MRP రేటు ప్రకారమే, ప్రయాణికుల దగ్గర వసూలు చేసేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.