VIDEO: జిల్లాలో కిడ్నాప్ కలకలం

PLD: వినుకొండ రూరల్ మండలం వెంకుపాలెం గ్రామం వద్ద జంగాగమేశ్వరపాడు గ్రామానికి చెందిన ఒంటేరు నాగరాజు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి ప్రత్యర్ధులు తీసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కూరగాయలు అమ్ముకునేందుకు వెంకుపాలెం వైపు వస్తుండగా బొలెరో వాహనం అడ్డం పెట్టి ఎనిమిది మంది వ్యక్తులు దాడిచేసి నాగరాజును కిడ్నాప్ చేసినట్లు భార్య తెలిపింది.